Bimbisara : బింబిసార చిత్రాన్ని కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ద్వారా యువ దర్శకుడు వశిష్టను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నిర్మించారు. ఒక పవర్ ఫుల్ కథాంశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడంలో వశిష్ట సక్సెస్ ను సాధించారని చెప్పవచ్చు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన పరంగా అందరి దృష్టినీ ఆకర్షించారు. 2015 లో విడుదలైన పటాస్ చిత్రంతో కల్యాణ్ రామ్ హిట్‌ను అందుకోగా.. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు అన్నీ ఫ్లాప్ గా నిలిచాయి.
ఈ ఏడాది ఆగస్టు 5న విడుదలైన బింబిసార చిత్రంతో సక్సెస్ ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్ర విజయంతో కళ్యాణ్ రామ్ తిరిగి సక్సెస్ ఫేమ్ లోకి వచ్చేశాడు. రోటీన్ కథలకు భిన్నంగా ఉన్న బింబిసార చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల చేత విజిల్స్ వేసే రేంజ్‌లో ఆకట్టుకుంది.

సినిమా విడుదలై 10 రోజులు గడుస్తున్నా వసూళ్ళ పరంగా ఎక్కడా తగ్గకుండా రోజురోజుకూ లాభాల బాటలో దూసుకుపోతోంది. ఇక తాజాగా పది రోజులు పూర్తి చేసుకున్న తర్వాత బింబిసార చిత్రం ఏరియా పరంగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి. సీడెడ్ రూ.5.51 కోట్లు , నైజాం రూ.6.80 కోట్లు ఉత్తరాంధ్ర రూ.2.89 కోట్లు, గుంటూరు రూ.2.27 కోట్లు, కృష్ణా రూ.1.99 కోట్లు, తూర్పుగోదావరి రూ.1.99 కోట్లు, పశ్చిమగోదావరి రూ.1.73 కోట్లు, నెల్లూరు 1.68 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది.
ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రూ.26.59 కోట్ల షేర్ ను, రూ.53.18 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 10 రోజుల్లో బింబిసార చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.30.46 కోట్ల షేర్ రాబట్టుకుంది. అదేవిధంగా రూ.60. 32 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ చిత్రానికి ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం రూ.35 నుంచి రూ.40 కోట్ల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.