Chiranjeevi : సోషల్ కంటెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్ కొరటాల శివ. ఆయన మొదటి సినిమా మిర్చి దగ్గర నుంచి భరత్ అనే నేను వరకు ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాన్ని టచ్ చేశారు. అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ చిరు, చరణ్ కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే అనుకున్నారు. కట్ చేస్తే.. ఆచార్య ఇటు డైరెక్టర్ కెరీర్ లోనూ అటు హీరో చిరు కెరీర్ లోనూ అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది.
ఆ పరాజయం నుంచి మెగాస్టార్ ఇంకా కోలుకోక ముందే మరో పరాభవం ఎదురైంది. అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చడ్డా చిత్రం తెలుగు వెర్షన్ ను చిరంజీవి కొనుగోలు చేసి ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొన్నారు. ప్రతి ఇంటర్వ్యూలో, ప్రెస్ మీట్‌లో చిరు లాల్ సింగ్ చడ్డా మూవీని ఆకాశానికి ఎత్తారు. అయితే సినిమా ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ చిత్రానికి హిందీతోపాటు తెలుగులో కూడా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.
ఫారెస్ట్ గంప్ సినిమా చూసిన వారికి ఈ లాల్ సింగ్ చడ్డా రీమేక్ అంతగా నచ్చలేదు. అసలు ఒరిజినల్ చూడని ప్రేక్షకులకు ఇది పెద్దగా అర్థం కాని డాక్యుమెంటరీలా అనిపించింది. దీంతో థియేటర్ లలో కలెక్షన్స్ అంతగా రావట్లేదు. మెగాస్టార్ ఎంతో నమ్మకంతో లాల్ సింగ్ చడ్డాను తెలుగులో రిలీజ్ చేసినప్పటికీ చివరకు మరోసారి చిరంజీవికి నిరాశే మిగిలింది.
ప్రస్తుతం చిరు అనేక సినిమాలతో బిజీగా ఉన్నారు. గాడ్‌ఫాదర్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దీనితో పాటు బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య సినిమా కూడా చేస్తున్నారు చిరు. ఇవేకాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు మెగాస్టార్.