మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్ బడ్జెట్ ధరలోనే మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ పేరిట ఆ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు.
ఈ ఫోన్‌లో 2 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇందులో 2 జీబీ ర్యామ్‌తోపాటు అదనంగా మరో 2 జీబీ వర్చువల్ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 32 జీబీ స్టోరేజ్‌ను ఏర్పాటు చేశారు. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు.
వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఈ ఫోన్ లో ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫేస్ అన్ లాక్ ఫీచర్ దీనికి లభిస్తుంది. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్ ఆక్వా స్కై, ఫోర్స్ బ్లాక్, ఆరిజిన్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో విడుదల కాగా.. ఈ ఫోన్‌ను రూ.6799 ధరకు విక్రయిస్తున్నారు. ఆగస్టు 12 నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.