Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన తీసిన గత నాలుగు చిత్రాలు వరుసగా హిట్ అయ్యాయి. భరత్ అనే నేను సినిమాతో మొదలు పెడితే.. మహర్షి, సరిలేరు నీకెవ్వరు, ఇప్పుడు సర్కారు వారి పాట.. మొత్తంగా 4 చిత్రాలు వరుసగా హిట్ అయ్యాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఎంతో జోష్‌లో ఉన్నారు. ఇక ఆయన తరువాత సినిమా ఏమిటా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే మహేష్ తీసిన లాస్ట్ 4 చిత్రాలు అన్నీ సమాజానికి మెసేజ్ ఇచ్చేవే. దీంతో ఫ్యాన్స్ ఈసారి భిన్నమైన కథను ఎంచుకోవాలని కోరుతున్నారు. ఇక ఇప్పటికే ఆయన తన 28వ సినిమాను కూడా అనౌన్స్ చేసేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో, పూజా హెగ్డె హీరోయిన్ గా ఆయన సినిమా చేయనున్నారు. అయితే సర్కారు వారి పాటకు ఆయన రూ.50 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ సినిమాకు ఆయన రూ.70 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే త్రివిక్రమ్‌తో మూవీ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

కాగా త్రివిక్రమ్‌తో మూవీ అనంతరం మహేష్.. రాజమౌళితో సినిమా చేస్తారు. ఈ మూవీ 2023 ప్రథమార్థంలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. దీనికి గాను రాజమౌళి తండ్రి విజేయంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం మహేష్ మరోమారు వెకేషన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చాక త్రివిక్రమ్‌తో మూవీని ప్రారంభించనున్నారు.