Anasuya : బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా సత్తా చాటుతున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇటీవలే తన భర్తతో కలిసి తమ పెళ్లి రోజు సందర్భంగా వెకేషన్‌కు వెళ్లి వచ్చింది. అక్కడి ఫొటోలను, వీడియోలను షేర్ చేసింది. అవి వైరల్ అయ్యాయి. బీచ్‌లో అయితే తన భర్తకు లిప్ లాక్ ఇచ్చింది. దీంతో ఆమెను చాలా మంది విమర్శించారు. ఇలాంటి ఫొటోలను పబ్లిగ్గా షేర్ చేయడం ఎందుకని విమర్శించారు. అయితే తనపై వచ్చే ట్రోల్స్, కామెంట్లను మాత్రం ఈమె ఇప్పుడు పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇక సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అనసూయ చేసే సందడి మామూలుగా ఉండడం లేదు. ఈమె ఎప్పటికప్పుడు అందులో ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. ఇక తాజాగా అనసూయకు చెందిన డ్యాన్స్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో అనసూయ పొట్టి నిక్కరు ధరించి విజయ్, పూజా హెగ్డె నటించిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు పాటకు డ్యాన్స్ చేసింది. ఆమె అలా డ్యాన్స్ చేస్తుంటే కుర్రకారు మైమరిచిపోతున్నారు. అనసూయ స్వతహాగానే మంచి నటి మాత్రమే కాదు.. ఆమె డ్యాన్సర్ కూడా. బుల్లితెరపై పలు షోలలోనూ ఇలాగే డ్యాన్స్ చేసి అలరిస్తుంటుంది. ఇక తాజాగా ఆమె చేసిన డ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. నెటిజన్లు ఆ డ్యాన్స్ ను చూసి ఫిదా అవుతున్నారు. చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశావని కామెంట్స్ పెడుతున్నారు.

కాగా అనసూయ బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయింది. తరువాత ఈమెకు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఈమె నటించిన సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. రంగస్థలం సినిమాలో ఈమె రంగమ్మత్తగా నటించి అలరించింది. అలాగే పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలోనూ మెరిసింది. ఇందులో ఈమె నెగెటివ్ పాత్రను పోషించింది. ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. త్వరలో పుష్ప 2 లోనూ ఈమె నటించనుంది. అలాగే కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ అనే మూవీతోపాటు దర్జా అనే ఇంకో మూవీలోనూ అనసూయ నటిస్తోంది. ఇవి త్వరలో రిలీజ్ కానున్నాయి.
#anasuya #dance #viralvideo pic.twitter.com/1eydZrbgL5
— India Daily Live (@IndiaDailyLive) June 27, 2022