Apple Products : టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది. మ్యాక్‌బుక్స్, ఐపాడ్స్, యాపిల్ పెన్సిల్, స్మార్ట్ కీబోర్డ్ తదితర ప్రొడక్ట్స్‌పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ స్టూడెంట్లకు మాత్రమే వర్తిస్తుంది. బ్యాక్ టు స్కూల్ పేరిట అందుబాటులోకి తెచ్చిన ఈ ఆఫర్ సహాయంతో స్టూడెంట్లు మాత్రమే కాకుండా టీచర్లు, స్టూడెంట్ల తల్లిదండ్రులు కూడా యాపిల్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2పై రూ.10వేల డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1పై కూడా రూ.10వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇక మ్యాక్‌బుక్ ప్రొ 13, 14, 16 ఇంచుల మోడల్స్‌పై కూడా రూ.10వేల వరకు డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీంతోపాటు ఐప్యాడ్స్‌ను రూ.54,900కు బదులుగా రూ.50,780 కి కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ప్రొ ధర రూ.71,900 ఉండగా రూ.68,300కి కొనవచ్చు.

ఇక ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్, ఐప్యాడ్ ప్రొ 11 ఇంచులు 3వ జనరేషన్, 12.9 ఇంచుల 5వ జనరేషన్ మోడల్స్‌పై కూడా ఇదే విధంగా డిస్కౌంట్లను పొందవచ్చు. ఎయిర్‌పాడ్స్ 3వ జనరేషన్ ను రూ.6400కి కొనవచ్చు. ఎయిర్‌పాడ్స్ ప్రొ ను రూ.12,200కు కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలోనే మ్యాక్‌బుక్ లేదా ఐప్యాడ్ కొంటే ఎయిర్‌పాడ్స్, 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఉంటుందని యాపిల్ తెలియజేసింది.