Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ.. సర్కారు వారి పాట. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ స్ట్రీమ్ అవుతోంది. ఇందులో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. అయితే సర్కారు వారి పాట విజయం అనంతరం మహేష్ వెంటనే ఇంకో మూవీని ఇంకా మొదలు పెట్టలేదు. కానీ ప్రస్తుతం ఆయన తన ఫ్యామిలీతో వెకేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తన వెకేషన్ తాలూకు ఫొటోలను తాజాగా పోస్ట్ చేశారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు.. తన భార్య నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్ కృష్ణ, కుమార్తె సితారలతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారు యూరప్ ట్రిప్‌లో ఉండగా.. తరువాత ఇటలీలో వెకేషన్‌కు వెళ్లనున్నట్లు మహేష్ తెలిపారు. ఈమేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తమ ఫొటోను పోస్ట్ చేశారు.

ఇక మహేష్ బాబు త్వరలోనే త్రివిక్రమ్ తో ఓ మూవీ చేయనున్నారు. అందులో ఆయనకు జోడీగా బుట్ట బొమ్మ పూజా హెగ్డె నటించనుంది. ఈ మూవీని త్వరగా పూర్తి చేయనున్న మహేష్.. తరువాత రాజమౌళి సినిమాలో పాల్గొంటారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు, హీరోయిన్, విలన్ ఎంపిక నడుస్తున్నాయి. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదే ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించాలని చూస్తున్నారు.