Actress Pragathi : సినీ నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తల్లిగా, అక్కగా, చెల్లిగా.. అనేక పాత్రల్లో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలోనూ ప్రగతి ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. పలు పాటలకు ఈమె అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. దీంతో ఆమె వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇక ప్రగతి ఇటీవలే తన జన్మదిన వేడుకలను కూడా జరుపుకుంది. ఆ వేడుకలో ఆమె ధరించిన డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి కూడా. అయితే అందరూ ఆమెను విమర్శించారు.
ఈ వయస్సులో పుట్టిన రోజులు ఎందుకు ఆంటీ.. అంటూ ప్రగతిని ట్రోల్ చేశారు. అయినప్పటికీ ఆమె అలాంటి కామెంట్స్ ను పట్టించుకోవడం లేదు. ఇక ఈమె నటించిన ఎఫ్3 మూవీ ఈమధ్యే విడుదల కాగా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ సక్సెస్ మీట్లో ప్రగతి మాట్లాడుతూ తాను ఎన్నో పాత్రల్లో నటించానని.. కానీ ఎఫ్3లో వైవిధ్యభరితమైన పాత్ర చేశానని.. ఇది తనకు జీవితాంతం గుర్తుండి పోతుందని ఆమె ఎమోషనల్ అయ్యింది. ఇక ప్రగతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
![Actress Pragathi : నటి ప్రగతి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? ఆశ్చర్యపోతారు..! do you know about Actress Pragathi remuneration](https://i0.wp.com/indiadailylive.com//wp-content/uploads/2022/06/actress-pragathi-1.jpg?resize=1200%2C650&ssl=1)
అయితే చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు రోజువారీగా రెమ్యునరేషన్ తీసుకుంటారు. రోజుకు ఇంత అని చెప్పి ఎన్ని రోజులు షూటింగ్ చేస్తే అన్ని రోజులకు వారు రెమ్యునరేషన్‌ను తీసుకుంటారు. ప్రగతి కూడా అలాగే పారితోషికం తీసుకుంటుంది. ఇక ఈమె రోజుకు సుమారుగా రూ.50 వేల నుంచి రూ.70వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సినిమాలకు ఈమె ప్యాకేజీ కింద కూడా రెమ్యునరేషన్ తీసుకుంటుందట. కాగా ప్రగతి ప్రస్తుతం బోళా శంకర్ సినిమాతోపాటు పలు ఇతర చిత్రాల్లోనూ నటిస్తోంది.