Kangana Ranaut : కంగనా రనౌత్.. ఈ పేరు చెప్పగానే మనకు వివాదాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. ఈమె సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. ఈమె ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా వివాదాస్పదం అవుతుంటుంది. అయితే కంగనా రనౌత్ గత 2 రోజుల నుంచి భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. ఈమెను నెటిజన్లు తెగ విమర్శిస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు. అయితే అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే..
కంగనా రనౌత్ ఇటీవల నటించిన చిత్రం.. ధాకడ్.. ఈ మూవీలో దివ్యా దత్తా, అర్జున్ రామ్‌పాల్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ మే 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు అసలు ఏమాత్రం ఆసక్తిని చూపించడం లేదు. దీంతో తొలి రోజు నుంచే 80 శాతానికి పైగా థియేటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అయితే నష్టాలతో థియేటర్లను రన్ చేయలేరు.. కనుక థియేటర్ల యాజమాన్యాలు ధాకడ్ సినిమాను తీసేసి వేరే సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. దీంతో కంగనా రనౌత్‌కు ఘోర పరాభవం ఎదురైనట్లు అయింది.

ఇప్పటి వరకు కంగనా నటించిన ఏ సినిమా కూడా ఇంతటి ఘోర పరాభవాన్ని మూటగట్టుకోలేదు. కాస్తో కూస్తో ఆడింది. కానీ ధాకడ్ మాత్రం అత్యంత అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ క్రమంలోనే అనేక థియేటర్లలో ఈ సినిమాను తీసేసి వేరే సినిమాలను ప్రదర్శిస్తున్నారు. దీంతో నెటిజన్లకు ఒక ఆయుధం లభించినట్లు అయింది. ముఖ్యంగా కంగనా అంటే మండిపడేవారు ఇప్పుడు ఆమెపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆమెను భారీ ఎత్తున ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు.
కంగనా రనౌత్ అసలు భూమిపై నిలబడలేదని.. ఎంతో పొగరుగా ఉండేదని.. అయితే ఆమెకు ఉన్న పొగరు, అహంకారం అన్నీ కరిగిపోయాయి.. అంటూ చాలా మంది నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా ఇలాంటి ఓటములకు భయపడదనే విషయం తెలుసు. మరి ఆమె రానున్న రోజుల్లో ఎలాంటి సినిమాలతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.