Hansika : దేశ ముదురు సినిమాతో హన్సిక మోత్వాని టాలీవుడ్‌కు పరిచయం అయింది. అంతకు ముందే ఆమె బాలనటిగా కూడా ఆకట్టుకుంది. అయితే దేశముదురు సినిమా హిట్ కావడంతో ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ సినిమా తరువాత వచ్చిన ఈ అమ్మడి మూవీలు ఏవీ అలరించలేకపోయాయి. కంత్రి, మస్కా, బిల్లా, జయీభవ వంటి చిత్రాలు ఆశించిన మేర విజయాన్ని ఈమెకు అందించలేదు. కానీ తరువాత వచ్చిన సీతారాముల కల్యాణం సినిమా ఫర్వాలేదనిపించింది. దీంతో ఈ అమ్మడు కాస్త నిలదొక్కుకున్నట్లే అనిపించింది. అయితే ఆ తరువాత వచ్చిన మూవీలు అంతగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ హన్సిక మాత్రం అడపా దడపా పలు ఇతర భాషలకు చెందిన చిత్రాల్లో నటిస్తూనే ఉంది.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియా హవా ఎక్కువగా ఉంది కనుక ఆ మాధ్యమంలో ఈమె ఫాలోవర్లను పెంచుకుంటోంది. అందుకు గాను ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇక తాజాగా ఆమె మాల్దీవ్స్ లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ అక్కడి ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. వాటిల్లో ఈ అమ్మడి అందాలను చూసి హీటెక్కిపోతున్నారు. అసలే ఎండ వేడిగా ఉందంటే.. ఈ అమ్మడి అందాలు ఇంకా సెగలు పుట్టిస్తున్నాయి.
View this post on Instagram
హన్సిక గతంలో చాలా లావుగా ఉండేది. కానీ ఈమె బాగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించింది. దీంతో నాజూగ్గా తయారైంది. ఇక ఈ మధ్యకాలంలో ఈమె పెడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో హన్సిక చాలా సన్నగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. లేటెస్ట్గా ఈమె షేర్ చేసిన ఫొటోలు కుర్రకారు గుండెల్లో మంట పెడుతున్నాయి. కాగా హన్సిక ప్రస్తుతం పలు తెలుగు, తమిళ మూవీలతో బిజీగా ఉంది. మహా, పార్ట్నర్, రౌడీ బాయ్ అనే తమిళ సినిమాలు చేస్తోంది. ఇంకో రెండు తమిళ సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధమవుతోంది. వీటితోపాటు 105 మినట్స్, మై నేమ్ ఈజ్ శృతి అనే రెండు తెలుగు మూవీల్లోనూ ఈమె నటిస్తోంది. ఇవి త్వరలో విడుదల కానున్నాయి.