Mahesh Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే ఆయన మహేష్‌తో కలిసి దుబాయ్‌కి వెళ్లి వచ్చారు. అక్కడ కథను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజమౌళి తండ్రి, రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే మహేష్ – రాజమౌళి మూవీపై ఆయన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఆ మూవీ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కొనసాగుతుందని చెప్పేశారు. ఇంకా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీకి గాను ప్రస్తుతం తాను స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే మహేష్ త్వరలో త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు. కనుక రాజమౌళితో సినిమా వచ్చే ఏడాదే ప్రారంభం అవుతుందని చూచాయగా చెప్పారు. ఇక కథను ఇంకా పూర్తిగా సిద్ధం చేయాలని.. కానీ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగుతుందని అన్నారు.
ఇక గతంలో రాజమౌళి సినిమాల్లో చూడని విజువల్స్ ఈ మూవీలో ఉంటాయని అన్నారు. అద్భుతమైన యాక్షన్, డ్రామా, థ్రిల్స్‌తో సినిమాను తెరకెక్కిస్తారని చెప్పారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా.. ఎప్పుడు ఫస్ట్ అప్‌డేట్ వస్తుందా.. అని తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.