Sreemukhi : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు శ్రీముఖి. జులాయి సినిమాతో నటిగా పలకరించిన ఈ అమ్మడు ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. అయితే పటాస్ సినిమాతో బుల్లితెర రాములమ్మగా మారి ప్రేక్షకులని అలరిస్తోంది. కొద్ది రోజుల పాటు వరుస టీవీ షోలతో తెగ అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అడపాదడపా కనిపిస్తోంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్‌గా మారి తన క్యూట్ లుక్స్‌తో అలరిస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్సులో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో శ్రీముఖి క్యూట్ లుక్స్ ను చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు.

శ్రీముఖి నంబర్ వన్ పొజిషన్ ఇంకా అందుకోలేకున్నా.. ఈవెంట్స్, రెమ్యూనరేషన్స్, సంపాదనలో తక్కువేమీ కాదు. శ్రీముఖి వయసులో చిన్నదైనా కానీ.. తెలివితేటలతో పలు రంగాల్లో రాణిస్తోంది. ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా.. శ్రీముఖి ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. బిగ్ బాస్ షోతో ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా బాగా అందుకున్నట్టు సమాచారం. హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ తో మాల్దీవ్స్ కు చెక్కేసి, అక్కడ తెగ ఎంజాయ్ చేసింది శ్రీముఖి.
పుష్పలో బన్నీడైలాగ్ కంటే శ్రీముఖి రచ్చే తగ్గేదెలే అనేట్టుగా ఉంటోంది. ఒకవైపు టీవీ షోలతో సందడి చేస్తున్నా కూడా వెండితెరపై అడపాదడా సందడి చేస్తోంది. ఇటీవల క్రేజీ అంకుల్స్ చిత్రంతో పలకరించిన శ్రీముఖి ఇప్పుడు భోళా శంకర్ చిత్రంలో చిరంజీవితోపాటు నటిస్తుంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన షూటింగ్ పూర్తైనట్టు సమాచారం. మరోవైపు సరిగమప అనే టీవీ షో చేస్తోంది శ్రీముఖి.