టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషిగా ఎదిగిన హీరో. ఈ క్రమంలోని ఎంతోమంది పేద వారికి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలను ఉచితంగా నిర్వహిస్తున్నారు.ఇదివరకే బ్లడ్ బ్యాంకులను, ఐ బ్యాంకులను నిర్వహించి ఎంతోమందికి ప్రాణాలు నిలబెట్టారు.అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ఎంతో మందికి ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రతి జిల్లాలోని ఆక్సిజన్ బ్యాంకులను అందుబాటులోకి తీసుకువస్తానని ఇదివరకే ప్రకటించారు.
ప్రతి జిల్లాలోను ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి అవసరమైన వారికి అందేలా చూస్తానని తెలియజేసిన మెగాస్టార్ ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ‘చిరు ఆక్సిజన్ బ్యాంకు సేవలు’ప్రారంభమయ్యాయి.
https://twitter.com/Chiranjeevi_CT/status/1397401327009820675?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1397401327009820675%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-37639782393983277500.ampproject.net%2F2105150310000%2Fframe.html
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అనుకున్న ప్రకారమే వారం రోజులలోగా వందలాది ఆక్సిజన్ సిలిండర్లను, కాన్‌సన్‌ట్రేటర్లు సంపాదించాం. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో బుధవారం నుంచి “చిరు ఆక్సిజన్ బ్యాంక్”సేవలు ప్రారంభమవుతాయని, త్వరలోనే బ్యాంకు సేవలు మరికొన్ని జిల్లాల్లో కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయటం వల్ల ఏ ఒక్కరు కూడా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఈ మహత్తర కార్యం చేపట్టినట్లు చిరంజీవి తెలియజేశారు.