Anchor Suma : బుల్లితెరపై తనదైన శైలిలో అలరిస్తూ స్టార్ హీరోయిన్ లాంటి క్రేజ్ దక్కించుకున్న యాంకర్లలో సుమ ఒకరు. ఆమె కళ్ల ముందు ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లారు. సుమ మాత్రం తన యాంకరింగ్‌తో అలరిస్తూనే ఉంది. ఒకప్పుడు నటిగా అలరించిన సుమ కొంత గ్యాప్ తర్వాత జయమ్మ పంచాయతీ అనే సినిమా చేస్తోంది. మే 6న ఈ చిత్రం విడుదల కానుండగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్‌లో నాగార్జున, నానిలు సందడి చేశారు. ఇక సుమ భర్త, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల కూడా కనిపించారు.

చాలా రోజుల తర్వాత రాజీవ్ కనకాల ఇలా ఒక ఈవెంట్‌లో సందడి చేయడంతో అతనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. యాంకరమ్మలతో కలిసి ఫోటోలు దిగమని సుమని పిలవడం, కీరవాణితో కలిసి ఫోటోలు దిగాలని అనడం.. ఇలా అన్ని చోట్లా రాజీవ్ కనకాల సందడి చేశారు. జయమ్మ పంచాయితీ మే 6న, మే 6వ తారీఖు.. అంటూ స్టేజ్ మీద ప్రచారం కల్పించారు. ఇలా తాను అన్ని చోట్ల ప్రచారం చేసినందుకు సుమకు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులివ్వాలని నిర్మాతలను అడిగేశారు. అందరూ సినిమాను చూసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను అని చెప్పి.. విజిల్స్ వేయోచ్చు కదా? అని ఆడియెన్స్‌ను ఉద్దేశించి అన్నాడు.
అనంతరం సుమపై ఓ పంచ్ వేశాడు. సుమ వచ్చినప్పటి నుంచీ.. జై సుమక్క అని అరుస్తూనే ఉన్నారు.. ఎన్ని డబ్బులు ఇచ్చింది.. అంటూ స్టేజ్ మీదే అందరి ముందు అనేశారు. దీంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఏదేమైనా సుమ, రాజీవ్ లు చాలా రోజుల తర్వాత ఇలా జంటగా కనిపించిన నేపథ్యంలో అభిమానులు చాలా సంతోషించారు. ఇక సుమ తన స్పీచ్‌లో.. అందరు హీరోల అభిమానులు నా సినిమాను చూస్తారని ఆశిస్తున్నాను. మీరు చూస్తే మా సినిమా హిట్ అవుతుంది. కొత్త వాళ్లందరినీ మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను అని సుమ తన స్పీచ్‌ను ముగించారు.