చాలామంది గోంగూరతో తయారు చేసిన వివిధ రకాల వంటలను తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే కొందరు గోంగూర పచ్చడి తయారు చేసుకోగా మరికొందరు గోంగూర చికెన్, గోంగూర చట్నీ తయారుచేసుకుంటారు. అయితే చాలామంది గోంగూరతో చట్నీ తినడానికి ఎంతో ఇష్టపడతారు. మరి గోంగూర చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం…
కావలసిన పదార్థాలు
*గోంగూర అరకిలో
*పచ్చిమిర్చి 15
*వేరుశనగ పల్లీలు ఒక చిన్న కప్పు
*ఉప్పు తగినంత
*ఉల్లిపాయ ఒకటి
తయారీ విధానం
ముందుగా గోంగూరను శుభ్రం చేసుకొని బాగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిరపకాయలను కడిగి అదే గిన్నెలో వేసి ఒక గ్లాసు నీటిలో వేసి స్టవ్పై ఉడికించాలి. అదేవిధంగా స్టవ్ పై ఒక గోళం ఉంచి వేరుశెనగ పల్లీలను వేయించుకోవాలి. వేరుశెనగ పల్లీలను శుభ్రం చేసుకుని రోటిలో మెత్తగా రుబ్బాలి. తరువాత ఈ వేరు శనగ పిండిని గిన్నెలోకి తీసి ఉడికిన పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. తరువాత దీనిలోకి ఉడికిన గోంగూర వేసి రుబ్బాలి. తరువాత ఈ మిశ్రమంలోకి పక్కకు పెట్టిన వేరు శెనగ పిండిని వేసి మొత్తం బాగా కలిసిపోయేలా రుబ్బుకోవాలి. చివరిగా ఈ గోంగూర మిశ్రమంలోకి ఉల్లిపాయ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకుని కలపడం ద్వారా ఎంతో రుచికరమైన గోంగూర చట్నీ తయారునట్లే. ఈ గోంగూర చట్నీలోకి రాగిముద్ద ఎంతో అద్భుతంగా ఉంటుంది. గోంగూర చట్నీ, రాగిముద్ద రాయలసీమ ప్రత్యేక వంటకంగా చెప్పవచ్చు.