బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటించిన సినిమాలన్నీ ఫాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ “సలార్” సినిమాలో నటిస్తున్నారు.ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా మొట్టమొదటిసారిగా శృతి హాసన్ జతకడుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీ కొట్టడం కోసం పవర్ ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే…జాన్ అబ్రహం.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం జాన్ అబ్రహం కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉందనేది మాత్రం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఒక షెడ్యుల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.