Hansika : బబ్లీ గార్ల్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దేశముదురుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హన్సిక మోత్వానీ 2019 నుంచి సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యిందీ మస్కా బ్యూటీ. ఇప్పుడు ఆమె చేతిలో తొమ్మిది సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందంతోపాటు అభినయం కూడా ఉన్న నటి కావడంతో ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సక్సెస్ సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి.
మహా, మై నేమ్ ఈజ్ శృతి, రౌడీ బేబీ, పార్ట్‌నర్ సినిమాలతోపాటు ఒక ఓటీటీ ప్రాజెక్టు చేతిలో ఉందని తెలుస్తోంది. ఇవి కాకుండా మరో మూడు సినిమాలున్నాయి. అందుకే 2022 కొత్త ఏడాది తనకెంతో ప్రత్యేకమంటోంది హన్సిక. టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన హన్సికకు ఇక్కడ పెద్దగా కలిసి రాలేదు. తమిళంలో మాత్రం ఆమెను ఆరాధ్య దేవతగా కొలుస్తున్నారు. సౌత్‌లో రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందరి మాదిరిగా బాలీవుడ్ వైపు దృష్టి పెట్టలేదు.
ఆడియన్స్ కు ఆరాధ్య దేవతగా మారిపోయింది హాన్సిక. ఎటు చూసుకున్నా సౌత్ లోనే అటూ.. ఇటూ.. తిరిగింది కానీ.. బాలీవుడ్ లో మాత్రం పాగా వేయలేక పోయింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన కోయి మిల్ గయా సినిమాలో బాల నటిగా నటించింది హన్సిక. అయితే ఆ తరువాత హీరోయిన్ గా మాత్రం బాలీవుడ్ లో రాణించలేకపోయింది. 2008లో వచ్చిన మనీ హై తో హనీ హై హిందీ సినిమాలో మెరిసిన హన్సిక మళ్లీ ఆ తర్వాత వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దానికి కారణం చెప్పుకొచ్చింది. అన్ని రకాల సినిమాలు చేయడాన్ని నేను ఎంజాయ్ చేస్తా. కానీ నాకు ఆఫర్లు మాత్రం ఎక్కువ సౌత్ ఇండస్ట్రీ నుంచే వస్తున్నాయి. దక్షిణాదిన కథలతోపాటు కంటెంట్ ఎక్కువగా ఉంటుందని నేను నమ్ముతాను అంటుంది హన్సిక. మరి రానున్న రోజులలో హన్సికకి బాలీవుడ్ ఆఫర్స్ వస్తే ఓకే చేస్తుందా.. లేదా.. అనేది చూడాలి.