ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఎంతో మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలారు. తల్లిదండ్రులను కోల్పోవడంతో ఎంతో మంది చిన్నారులు రోడ్డున ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు.
కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులు కోల్పోయి ఎంతో మంది పిల్లలు అనాధగా మారారు. ఈ విధంగా అనాథగా మారిన చిన్నారులను చేరదీయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారులు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను గుర్తించే పనిలో ఉన్నారు.
కడప జిల్లాలో కరోనా కారణం వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన 142 మంది చిన్నారులను గుర్తించినట్లు ICDS పిడి పద్మజా తెలిపారు.ఇదివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిన విధంగా తల్లిదండ్రులు కోల్పోయిన 142 మంది చిన్నారులకు 10 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేస్తామని అధికారులు తెలిపారు.