Shruti Haasan : సోషల్ మీడియాలో సెలబ్రిటీల హవా మామూలుగా ఉండడం లేదు. ముఖ్యంగా హీరోయిన్లు ఓ వైపు గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ వాటిని తమ సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తూనే.. మరోవైపు తమ వ్యక్తిగత, సినిమా జీవితాలకు చెందిన విశేషాలను రోజూ తమ ఫాలోవర్లతో పంచుకుంటున్నారు. అలాగే పలు కంపెనీలకు చెందిన ఉత్పత్తులన ప్రమోట్ చేస్తూ.. యాడ్స్ ద్వారా కూడా తెగ సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో శృతి హాసన్ ఒకరు. అయితే ఈమెకు తాజాగా ఓ నెటిజన్ నుంచి చిలిపి ప్రశ్న ఎదురైంది. అదేమిటంటే..

శృతి హాసన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో కాసేపు ముచ్చటించింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేరిట నిర్వహించిన చాట్ సెషన్‌లో ఆమె లైవ్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే ఓ నెటిజన్ ఆమెకు చిలిపి ప్రశ్న వేశాడు. నీ పెదవుల సైజ్ ఎంత ? అని ఆమెను డైరెక్ట్ గా అడిగేశాడు. దీంతో బిత్తరపోయిన శృతి హాసన్ వెంటనే తేరుకుని అతగాడి ప్రశ్నకు అంతే దీటుగా రిప్లై ఇచ్చింది.
నీకు నా పెదవుల సైజ్ కావాలా ? అసలు అది కూడా కొలుస్తారా ? రా కావాలంటే కొలిచి చూసుకో.. అంటూ ఆమె ఒక ఫొటోను షేర్ చేస్తూ రిప్లై ఇచ్చింది. దీంతో ఆమె ఫొటో వైరల్ అవుతోంది. ఇక శృతి హాసన్ ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నందమూరి బాలకృష్ణ సినిమాతోపాటు ప్రభాస్‌తో కలిసి సలార్ అనే మూవీలో నటిస్తోంది.