Sri Reddy : శ్రీ రెడ్డి.. ఒకప్పుడు తన అందచందాలతో రచ్చ చేసిన అందాల ముద్దుగుమ్మ. నిత్యం సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తుంటుంది. ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ వేదికగా హితబోధ చేసింది శ్రీరెడ్డి. తన జీవిత అనుభవాలను వాటి ద్వారా నేర్చుకున్న పాఠాలను తెలియజేస్తూ సూక్తులు చెప్పుకొచ్చింది. ప్రేమ పేరుతో మోసపోతున్న అమ్మాయిలకు జాగ్రత్తలు చెప్తూనే.. అమ్మాయిలు అబ్బాయిల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పుకొచ్చింది. అబ్బాయిల్ని డబ్బుల కోసం వాడుకుని ఆ తరువాత రోడ్డుమీదికి లాగొద్దు.. అబ్బాయిల ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. షాపింగ్‌ల కోసమో.. కారు కోసమో.. ఇల్లు కోసమో చాలామంది అమ్మాయిలు, పెళ్లైన ఆంటీలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.. ఇలాంటి ఎఫైర్స్‌తో మీ పర్సనల్ లైఫ్‌ని ఇబ్బందుల్లో పెట్టుకోకండి అంటూ హితబోధ చేసింది శ్రీరెడ్డి.

గత కొద్ది రోజులుగా శ్రీ రెడ్డి వంటకాలతో అలరిస్తూ ఉంది. వెరైటీ వంటకాలని పరిచయం చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు సముద్రంలో ప్రయాణించి ఆ తర్వాత ఒడ్డున వంటకాలు చేసింది. శ్రీ రెడ్డి వంటకాలని రుచి చూసిన వారు మైమరచిపోతున్నారు. ఆ వంటకాలకు ఎవరైన ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పనిలో పనిగా శ్రీ రెడ్డి పలు రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపం చేసింది. మత్య్యకారులకి తగిన సాయం అందించాలని కోరింది.
సినీ నటిని అని చెప్పుకునే శ్రీ రెడ్డి తాను చేసిన సినిమాల కంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు చేసిన ప్రదర్శనే వల్ల ఎక్కువ పాపులర్ అయింది. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ తనకు అవకాశాలు ఇస్తానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడు.. అంటూ ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు అప్పట్లో టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. అయితే ఆ తర్వాత అనూహ్యంగా చెన్నైకి మకాం మార్చేసిన శ్రీరెడ్డి ఇటీవలి కాలంలో వంటకాలతో వార్తలలో నిలుస్తోంది. పలు రకాల వంటకాలు చేస్తూ నోరూరిస్తోంది.