Sreeja : చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి అందరికీ తెలిసిందే. ఈమె గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కూతురికి జన్మనిచ్చింది. అయితే కొంతకాలం పాటు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తమ సమీప బంధువైన కళ్యాణ్ దేవ్ కి శ్రీజను ఇచ్చి ఎంతో అంగరంగ వైభవంగా రెండవ వివాహం చేశారు. ఇక వీరిద్దరికీ ఒక కూతురు జన్మించింది.

ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీజ సోషల్ మీడియా ఖాతాలో తన భర్త పేరును తొలగించి శ్రీజ కొణిదెల అని పేరు పెట్టుకోవడంతో పెద్ద ఎత్తున వీరి వైవాహిక జీవితం గురించి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు.. అంటూ వార్తలు కూడా షికార్లు చేస్తున్నాయి. అయితే శ్రీజ ప్రస్తుతం తన భర్తకు దూరంగా ఉంటోంది. శ్రీజ కూడా మెగా కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఫంక్షన్లకు హాజరు కావడం లేదు.
ఇక శ్రీజ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. అందులో ఇలా రాసుకొచ్చింది. నేర్చుకోకుండా ఉండటం, తిరిగి నేర్చుకోవడం వంటివి నేర్చుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అసలు శ్రీజ తన పోస్టు ద్వారా ఏం చెప్పాలి.. అనుకుంటుందో తెలియక అందరినీ కన్ఫ్యూజన్ కు గురి చేస్తోందనే చెప్పాలి. ఇక ఈ మధ్యకాలంలో శ్రీజ కుకింగ్ పై ఫోకస్ పెట్టి నిత్యం ఏదో ఒక వంట చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీజ తన ఇన్ స్టా స్టోరీలో ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఎగ్‌తో ఏదో వెరైటీ చేస్తూ ఎగ్ కి బానిసయ్యానని చెప్పుకొచ్చింది. అసలు శ్రీజ ఏం చేస్తోంది.. ఎందుకిలా అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తుందనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.