మొబైల్స్ తయారీదారు షియోమీ.. రెడ్‌మీ వాచ్ పేరిట ఓ నూతన స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 1.4 ఇంచుల టచ్ కలర్ ఎల్‌సీడీ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. 200కు పైగా వాచ్ ఫేసెస్ ఇందులో లభిస్తున్నాయి. 24 గంటలూ హార్ట్ రేట్‌ను తెలుసుకోవచ్చు. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 11 రకాల స్పోర్ట్స్ మోడ్స్, జీపీఎస్‌కు సపోర్ట్ ఇందులో లభిస్తున్నాయి.
రెడ్‌మీ వాచ్ ఫీచర్లు
- 1.4 ఇంచ్ టచ్ కలర్ ఎల్‌సీడీ డిస్ ప్లే, 320×320 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- బారోమెట్రిక్ ప్రెషర్ సెన్సార్, బ్లూటూత్ 5.1, ఆండ్రాయిడ్, ఐఓఎస్ కనెక్టివిటీ
- 11 రకాల స్పోర్ట్స్ మోడ్స్, కంపాస్, ఆల్టీమీటర్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ మానిటర్
- నోటిఫికేషన్స్, మ్యూజిక్ కంట్రోల్, ఐడిల్ అలర్ట్స్, జీపీఎస్, వాటర్ రెసిస్టెన్స్
- 230 ఎంఏహెచ్ బ్యాటరీ, 9 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్
రెడ్‌మీ వాచ్ బ్లాక్, బ్లూ, ఐవరీ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. రూ.3,999 ధరకు ఈ వాచ్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్‌లలో మే 25వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు.