Ritika Singh : హీరోయిన్స్ అందరూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. అందులో భాగంగానే వారు తరచూ ఫొటోషూట్లు చేస్తూ తమ గ్లామర్‌ను ఒలకబోస్తున్నారు. ఆ ఫొటోలను తమ సోషల్ ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ మాత్రమే కాకుండా.. బుల్లితెర నటీమణులు కూడా ఇదే పంథాను కొనసాగిస్తున్నారు.
ఇక అందాల ముద్దుగుమ్మ రితికా సింగ్ కూడా తాజాగా ఓ గ్లామర్ ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలను షేర్ చేసింది. వాటిల్లో ఈ భామ భారీ అందాలు యువతకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. రితికా సింగ్ తరచూ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. కానీ తాజాగా షేర్ చేసిన ఫొటోలు మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి.
డార్క్ ఎల్లో కలర్ టాప్, జీన్స్ ధరించి రితికా సింగ్ దిగిన ఫొటోలను చూస్తుంటే కుర్రకారుకు మతులు పోతున్నాయి. ఈమె విక్టరీ వెంకటేష్‌తో కలిసి గురు సినిమాలో సందడి చేసింది. తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి.
తెలుగులో గురు సినిమాతోపాటు ఈమె నీవెవ్వరో అనే సినిమా చేసింది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన గురు సినిమాతో రితికా సింగ్ తెలుగు తెరకు పరిచయం అయింది. అనంతరం నీవెవ్వరో అనే మూవీలో నటించింది. అయితే ఆమెకు తెలుగులో అంత విజయాలు లేవు. కానీ ఓ మై కడవులే అనే తమిళ చిత్రం చక్కని విజయాన్ని అందించింది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.