Anasuya : టాప్ యాంకర్‌గా, నటిగా దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. ఈ అమ్మడు ఒకవైపు టీవీ షోలలో నటిస్తూనే మరోవైపు సినిమాలు చేస్తోంది. రీసెంట్‌గా పుష్ప చిత్రంలో దాక్షాయణి అనే పాత్రలో కనిపించి సందడి చేసింది. సుకుమార్, రామ్ చరణ్ ల కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టింది అనసూయ. ఈ సినిమాతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
పుష్ప నుంచి ఇటీవల విడుదలైన అనసూయ పోస్టర్స్ పై బాడీ షేమింగ్ చేశాయి పలు యూట్యూబ్ ఛానల్స్. దీనిపై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నేను లైవ్ లోకి వచ్చానంటే అందరికీ చాలా కంగారుగా ఉంటుంది. ఇప్పుడేం క్లాసులు పీకుతుందో అని. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ థంబ్ నెయిల్స్ చూశాను. వాటిని పట్టించుకోకూడదని అనుకుంటా, కానీ.. అన్ని సందర్భాల్లోనూ ఇంతే స్ట్రాంగ్ గా ఉండలేం కదా.. అందరికీ వీక్ మూమెంట్స్ ఉంటాయి.
ఎంత లావు అయిపోయిందో చూడండి.. ఓవర్ వెయిట్.. షాకింగ్.. లాంటి థంబ్ నెయిల్స్ పెట్టారు. మంచి వాటినే చదివి వాళ్లతోనే షేర్ చేసుకోవాలని అనకుంటున్నాను.. నేను వెయిట్ పెరిగాను.. ఈ సందర్భంలో మీ క్యారెక్టర్.. మీ దిగజారుడుతనాన్ని ఎలా ఎత్తుకుంటారని నేను ఆ కామెంట్స్ చేసేవాళ్లను అడుగుతున్నా.. నేను కూడా మీలాగే మాట్లాడగలను.. హర్ట్ చేయగలను, కానీ అది నా వ్యక్తిత్వం కాదు.. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అనసూయ. ప్రస్తుతం ఈ జబర్ధస్త్ బ్యూటీ స్టన్నింగ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి.