నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలిసిందే. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి తాజాగా స్టైలిష్ స్టార్ బన్నీ కోసం కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే కథ మొత్తం అల్లు అర్జున్ కి వినిపించగా అతనికి కథ నచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గౌతమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి బన్నీగ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే స్క్రిప్టు మొత్తం సిద్ధంగా ఉండగా త్వరలోనే అల్లు అరవింద్ కు కథ వినిపించినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ కూడా ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. క్రేజీ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో గౌతమ్ పాన్ ఇండియా తరహాలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
అన్ని సవ్యంగా జరిగితే గౌతమ్, బన్నీ కాంబినేషన్ లోని సినిమా దీపావళికి మొదలు కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అదే విధంగా గౌతమ్ జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ‘జెర్సీ’ తెలుగులో సూపర్ హిట్ టాక్ తో పాటు క్లాసిక్ మూవీ అని అనిపించుకుంది.