Dil Raju : దిల్ రాజు నిర్మాతగా మాత్రమే మనకు సుపరిచితం. కానీ అతనిలో సింగర్ కూడా దాగి ఉన్నాడనే విషయం రీసెంట్‌గా నిరూపితం అయింది. కరీంనగర్ లో ‘అమిగోస్ డ్రైవ్ ఇన్’ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు పాటలు పాడడం విశేషం.
గెస్ట్‌గా వెళ్లిన దిల్ రాజుని అక్కడ బ్యాండ్.. స్టేజ్‌పైకి ఆహ్వానించింది. తమతో కలిసి పాడాల్సిందిగా కోరారు ఆ బ్యాండ్ సింగర్స్. అయితే మొహమాటంగానే మైక్ అందుకున్న దిల్ రాజ్ పాట మొదలెట్టారు. మొదట్లో బెరుకుగా పాడిన ఆయన ఆ తర్వాత లీనమయ్యి ఎంజాయ్ చేస్తూ అదరగొట్టారు.
నాగార్జున నటించిన ‘నిర్ణయం’ సినిమాలోని ‘హలో గురూ ప్రేమ కోసమేరోయ్..’ అంటూ ఎంతో ఉల్లాసంగా ఆలపించారు. ఏ మాత్రం తడబడకుండా ఉత్సాహంగా ఆయన పాట పాడగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూస్తుంటే ఆయనతో ఎవరో ఒకరు సినిమాలో కూడా పాడిస్తారేమో అని అంటున్నారు.
#DilRaju Garu Singing at Karimnagar Drive Inn Opening 😉 pic.twitter.com/pgpTFZpFij
— Milagro Movies (@MilagroMovies) December 12, 2021