Malavika Mohanan : మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి చాలా సుపరిచితం. మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి పేరు సంపాదించిన మోహనన్ కుమార్తె అయిన మాళవిక ‘పేట’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. తొలి చిత్రంలోనే రజనీకాంత్‌తో నటించే గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆతర్వాత ‘మాస్టర్’ సినిమాతో మరో స్టార్ హీరో విజయ్‌తో జత కలిసింది.
ఇప్పుడు కోలీవుడ్ లో మరో స్టార్ హీరో ధనుష్ పక్కన ‘మారన్’లో నటిస్తోంది. దీంతోపాటు రవి ఉడయార్ దర్శకత్వంలో సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటిస్తున్న ‘యుత్ర’లో మాళవికా హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ మూవీ షూటింగ్లో భాగంగా ప్రస్తుతం కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో గాయపడినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది మాళవిక.
చేతికి, కాలికి తగిలిన దెబ్బలను షేర్ చేస్తూ.. యాక్షన్ సినిమా షూటింగ్స్‌లో పాల్గొన్నప్పుడు ఇలాంటి గాయాలు తగులుతుండడం కామన్ అని పేర్కొంది. ఆమె షేర్ చేసిన పోస్ట్ ని దాదాపుగా 2 లక్షల మందికి పైగా లైక్ చేయడం గమనార్హం. మాళవిక తమిళం, మలయాళంతోపాటు కొన్ని రోజుల క్రితం హిందీలో విడుదలైన వెబ్‌సిరీస్ ‘మసాబా మసాబా’లోనూ ఓ చిన్న పాత్రలో నటించింది . సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుంది.
https://www.instagram.com/p/CWzmJ0CqGBm/