Bigg Boss 5 : బిగ్ బాస్ కంటెస్టెంట్ 7 ఆర్ట్స్ సరయు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బోల్డ్ కామెంట్స్ తో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ఈమె అక్కడ కూడా కంటెస్టెంట్ లతో గొడవ పడటం వల్ల మొదటి వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో కలిసి మంచి ర్యాపో చేస్తోంది.
అదేవిధంగా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేస్తోంది. తాజాగా ఈమె రవి గురించి ఒక పోస్ట్ చేసింది. అయితే రవి ఎలిమినేట్ అయ్యాక కూడా అతని గురించి పోస్ట్ పెట్టి అతనికి మద్దతు తెలపాలని కోరింది. ఆమె అసలు ఈ పోస్టు ఎందుకు పెట్టిందో అర్థం కావడం లేదు.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారందరూ కూడా ఫేక్ కంటెస్టెంట్ లు, ఒక్క రవి తప్ప.. అంటూ సరయు కామెంట్ చేసింది. అతను ఎలిమినేట్ అవడం వల్లే ఆమె ఈ విధంగా కామెంట్ చేసిందని స్పష్టమవుతోంది. నిజానికి రవి హౌస్లో టాప్ 5లో ఉండదగిన కంటెస్టెంట్. కానీ ఎవరూ ఊహించని విధంగా అతను ఎలిమినేట్ అయ్యాడు. దీంతో విసుగు చెందిన సరయు ఈ విధంగా కామెంట్ చేసి ఉంటుందని అనుకుంటున్నారు.