సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కాయి.ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై మహేష్ అభిమానులు ఎంతో ఆతృత నెలకొంది.
త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ ని ఏవిధంగా చూపించబోతున్నాడనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 31న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభంకానుంది.
ఈ సినిమాలో మహేష్ పాత్ర గురించి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌బాబు ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలిసింది. దేశరక్షణ కోసం గూఢచర్యం నెరిపే ఏజెంట్‌గా ఆయన పాత్ర కొనసాగుతుందనే సమాచారం వినబడుతుంది. మహేష్ మునుపెన్నడు ఈ విధమైనటువంటి పాత్రలో నటించకపోవడం వల్ల ఈ పాత్ర పై మహేష్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది.అయితే వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో మహేష్ పాత్ర ఏ విధంగా ఉంటుందనేది చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.