దేశంలో ఉన్న వాహనదారుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మోటారు వాహన చట్టం కింద కొత్త కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టడమే కాక సేవలను అందించడాన్ని మరింత సులభతరం చేసింది. ఈ క్రమంలోనే వాహనదారులకు కేంద్రం మరో అద్భుతమైన సదుపాయాన్ని అందిస్తోంది. వాహనదారులు చనిపోతే వారి వాహనాలను తమ కుటుంబ సభ్యుల పేరిట ట్రాన్స్‌ఫర్ చేసునేందుకు ఇప్పటి వరకు చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. ఆ పద్ధతి అంతా గందరగోళంగా ఉండేది. కానీ దీన్ని కేంద్రం సులభతరం చేసింది.
ఇకపై వాహనదారులు తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలోనే సంబంధిత పత్రాల్లో నామినీగా ఎవర్నయినా పెట్టుకోవచ్చు. అంటే బ్యాంకు కార్యకలాపాల్లో ఎలాగైతే నామినీని పెట్టుకునే సదుపాయం కల్పిస్తున్నారో అలాగే వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలోనూ వాటికి నామినీలను పెట్టుకోవచ్చు. ఈ క్రమంలో వాహనదారులు చనిపోతే నామినీలు వాహనదారుడి డెత్ సర్టిఫికెట్‌ను, తమ ఐడీ ప్రూఫ్‌ను ఆర్‌టీఏ కార్యాలయంలో సమర్పించాలి. దీంతో 30 రోజుల్లోగా నామినీ పేరిట వాహనం ట్రాన్స్‌ఫర్ అయి కొత్త ఆర్‌సీ వస్తుంది. ఇలా సులభంగా ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. గతంలో ఈ విధానం చాలా క్లిష్టంగా ఉండేది. కానీ కేంద్రం మోటారు వాహన చట్టం నియామలు 1989 ప్రకారం కొత్తగా నామినీ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
అయితే ఇప్పటికే వాహనాలను రిజిస్టర్ చేయించుకున్న వారు కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. అందుకు గాను సంబంధిత రాష్ట్రానికి చెందిన ఆర్‌టీవో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ఫామ్‌ను నింపాలి. అందులో వాహనదారుడు తమ నామినీ పేరును నమోదు చేయడంతోపాటు నామినీకి చెందిన ఐడీ ప్రూఫ్‌ను ఇవ్వాలి. దీంతో వాహనదారుడి వాహనానికి నామినీలు నమోదు అవుతారు. తరువాత వాహనదారుడు ఎప్పుడైనా మరణిస్తే నామినీలు సులభంగా ఆ వాహనాన్ని తమ పేరిట పై విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కాగా ఈ కొత్త సదుపాయం తక్షణమే అందుబాటులోకి వచ్చిందని కేంద్రం తెలిపింది.