Lahari : బుల్లితెరపై ఎంతో ఆసక్తికరంగా బిగ్ బాస్ షో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్-5లో ఉంటుందనుకున్న లహరి మూడవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చింది. న్యూస్ రీడర్ గా, నటిగా, మోడల్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఈమె బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
కెరియర్ పరంగా బిజీగా ఉండే లహరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే లహరి వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించిన మందు బాటిల్ అన్నీ ముందు పెట్టుకొని ఒక డబ్ స్మాష్ చేసింది. ఆ వెంటనే ఒక పెగ్ తాగుతూ గ్లాస్ చేతిలో పట్టుకొని ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మందు తాగడంలో కూడా ఇంత స్టైల్ ఉంటుందా.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉంది.