Tamanna : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పని చేసే సెలబ్రిటీలు వారికి కొంత స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఎన్నో సినిమాలతో బిజీగా మారిపోతారు. ఈ క్రమంలోనే చాలా మంది వారి సినిమా వ్యవహారాలను, ఫైనాన్షియల్ వ్యవహారాలను చక్కబెట్టడం కోసం పర్సనల్ మేనేజర్లను పెట్టుకుంటారు. ఇలా వారి సినిమాలకు సంబంధించిన కాల్షీట్స్ లేదా ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్ ల విషయం గురించి మిగిలిన ఆర్థిక వ్యవహారాల గురించి మేనేజర్లు చూసుకుంటారు.
ఈ క్రమంలోనే సెలబ్రిటీలు వారు సంపాదించిన డబ్బులను కూడా మేనేజెర్ లను నమ్మి వారి చేతిలో పెడతారు. అయితే కొంత మంది మేనేజర్లు ఎంతో నమ్మశక్యంగా పనిచేస్తూ సెలబ్రిటీల ప్రశంసలు అందుకోగా.. మరికొందరు మాత్రం వారి చేతివాటం చూపిస్తూ ఎంతో మంది సెలబ్రిటీలను మోసం చేస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు మేనేజర్ల చేతిలో మోసపోయారు. అలాంటి సెలబ్రిటీలలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరని చెప్పవచ్చు.
ఈమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈమె ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ తన మేనేజర్ చేతిలో పెట్టి నిత్యం సినిమా షూటింగులతో బిజీగా ఉంటోంది. అయితే సదరు మేనేజర్ ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్ లు చెల్లించకపోవడంతో ఏకంగా తమన్నాకు నోటీసులు వచ్చాయి.
ఇలా నోటీసులు రావడంతో ఖంగుతిన్న తమన్నా తాను పూర్తిగా తన మేనేజర్ చేతిలో మోసపోయానని గ్రహించి తిరిగి ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్ కట్టి అప్పటినుంచి ఎవరినీ నమ్మకుండా డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోందట. అవును.. మరి.. ఈ రోజుల్లో సొంత కుటుంబ సభ్యులనే నమ్మలేకుండా ఉంది, ఇక పరాయి వారి ఒక లెక్కా..!