Nayanthara : తమిళ డైరెక్టర్ విఘ్నేవ్ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతారతో రిలేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు (నవంబర్ 18) తన ప్రేయసి నయనతార పుట్టినరోజు కావడంతో బుధవారం రాత్రి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ను ఏర్పాటు చేసి తన ప్రేయసికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.
ఈ క్రమంలోనే తన పుట్టిన రోజు వేడుకలకు తెలుగు సినీ నటి సమంత హాజరయ్యారు. ప్రస్తుతం ఈమె పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
https://www.instagram.com/p/CWY5C2_BfH-/?utm_source=ig_embed&ig_rid=ca63dcc1-6148-40fe-8f21-5dfc49a20e16
విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. కణ్మణి, తంగమేయి నా ఎల్లమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ ప్రేమ, ఆప్యాయతలతో నా జీవితం పరిపూర్ణం అయింది, నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను.. అంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
https://twitter.com/TrendNayanthara/status/1461144885667328003
ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రలలో కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలోనే నయనతార పుట్టినరోజు వేడుకలలో సమంత సందడి చేసింది. ఇక ఈమె కేక్ కటింగ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంతోమంది అభిమానులు ఈమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
https://twitter.com/kalonkarthik/status/1461045879725461506