Peddanna Movie : రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన పెద్దన్న చిత్రం తాజాగా దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇక చివరికి రజనీ అభిమానులు కూడా రజనీకాంత్ ఇలాంటి సినిమా చేయాల్సి వస్తుందని ఎప్పుడూ భావించలేదు అంటూ ఈ సినిమా గురించి నెగెటివ్ కామెంట్లు చేశారు. ఇలా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయిన ఈ సినిమాకి పూర్ రేటింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా డిజాస్టర్ గా పేరు సంపాదించుకుంది. ఇలా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేయలేకపోయిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం కోట్ల వసూలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లను చూస్తే సుమారు రెండు వందల కోట్లను కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇందులో తొలి రోజే ఏకంగా 70 కోట్ల కలెక్షన్లను రాబట్టింది అని చిత్రబృందం అంచనా వేశారు.
తెలుగు, తమిళ భాషలలో పూర్తిగా ప్లాప్ గా నిలబడిన ఈ సినిమా రూ.200 కోట్లను కలెక్ట్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. బాలీవుడ్ సూర్య వంశీ సినిమా కన్నా రజినీకాంత్ పెద్దన్న సినిమా అత్యధిక కలెక్షన్లను రాబట్టిందని తెలుస్తోంది. తమిళ రివ్యూవర్లు కూడా దారుణమైన రేటింగ్ ఇచ్చిన ఈ సినిమాకు ఈ రేంజిలో కలెక్షన్లు రావడం చూస్తుంటే కేవలం స్టార్ హీరోలు అయితే చాలు కథ, కథనంతో సంబంధం ఉండదని, కలెక్షన్లు వాటంతట అవే వస్తాయని పలువురు భావిస్తున్నారు.