Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రోజు రోజుకీ ఎంతో ఉత్సాహంగా కొనసాగుతోంది. వారాలు గడుస్తున్న కొద్దీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతుండడంతో.. ప్రేక్షకుల్లోనూ ఒకింత ఆసక్తి నెలకొంటోంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా ? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వారం మళ్లీ ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్‌లో ఉన్న రవి, సన్నీలకు ఓట్లు బాగానే పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మానస్‌కు కూడా ఓట్లు బాగానే పడుతున్నాయని సమాచారం. మిగిలినవారు సిరి, కాజల్. షణ్ముఖ్ ఎలాగూ నామినేషన్స్‌లో లేడు, కాబట్టి అతని ఓట్లు ఈసారి సిరికి పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం సిరి సేవ్ అవనుంది.
అయితే కాజల్‌కు మాత్రం తక్కువ ఓట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం కాజల్ ఎలిమినేట్ అవుతుందని సమాచారం. ఇప్పటి వరకు ఫీమేల్ కంటెస్టెంట్లు అయిన సరయు, ఉమాదేవి, లహరి, హమీదా, శ్వేత, ప్రియ లను బయటకు పంపారు. దీంతో ఈ వారం కాజల్‌ను బయటకు పంపనున్నారని తెలుస్తోంది. అదే జరిగితే మరో ఫీమేల్ కంటెస్టెంట్ బయటకు పోయినట్లే అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.