Sonu Sood : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం 9 వారాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో ప్రతి ఒక్కరూ ఎంతో స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ని హౌస్ లో ఉన్న సభ్యులకు పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలుపుతూ వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక కరోనా సమయంలో అందరి పాలిట దేవుడిగా నిలిచిన రియల్ హీరో సోనుసూద్ ఈ కార్యక్రమంపై స్పందించారు.
ఈ క్రమంలోనే సోనూ సూద్ ఒక వీడియోను విడుదల చేస్తూ బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం చూస్తున్నారా ? నేను కూడా చూస్తున్నాను, షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్, నా మద్దతు నీకే, ఐ లవ్ యూ మ్యాన్.. అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయింది.
https://www.instagram.com/p/CWDvyaplIgc/?utm_source=ig_embed&ig_rid=a3060cb5-7c91-4e09-8f9c-a39a3ea03d2b
ఈ క్రమంలోనే ఈ వీడియో పై స్పందించిన బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వావ్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీరామ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
ఇక సోనూ సూద్ అంతటి వారు శ్రీ రామచంద్రకు మద్దతు తెలపడంతో కచ్చితంగా బిగ్ బాస్ విజేతగా శ్రీరామచంద్ర నిలుస్తాడని శ్రీరామచంద్ర అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది హౌస్ నుంచి బయటకు వెళ్లగా, శ్రీ రామచంద్ర గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ శ్రీ రామచంద్ర గురించి తెలియజేశారు. మరి అందరి సహకారంతో శ్రీరామచంద్ర టైటిల్ గెలుస్తాడో.. లేదో.. వేచి చూడాలి.