Bigg Boss 5 : మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో అందరు ఇంటి సభ్యులు నామినేషన్స్‌లో జరిగిన ఇష్యూపై చర్చించుకుంటుంటే, ప్రియాంక మాత్రం మానస్ సేవలో తరించిపోవడానికే తపించిపోయినట్టుగా కనిపించింది. పదే పదే మానస్ వెనుక తిరుగుతుండడం ఆయనకు చిరాకు తెప్పించింది. అన్నం పెట్టనా మానస్ అని ప్రియాంక అంటే, దానికి మానస్.. నాకు కావాల్సింది నేను పెట్టుకుంటా.. నువ్ పెట్టాల్సిన పనిలేదని చెప్పాడు.
మళ్లీ మానస్ దగ్గరకు వచ్చి ఏమైనా కావాలా మానస్.. పెరుగు అన్నం తీసుకుని రానా? అని అడిగింది ప్రియాంక. వద్దు అని చెప్పాడు మానస్. కొంచెం తిను మానస్.. అని ప్రియాంక అడగడంతో మానస్‌కి చిర్రెత్తుకొచ్చింది. నాకు కావాలనిపిస్తే నేను పెట్టుకుంటా.. అని చెప్పాడు. దీంతో.. నేను ఏమైనా మిస్టేక్ చేశానా ? అని ప్రియాంక అడగడంతో.. తింటున్నా.. తరువాత మాట్లాడతా.. అని చెప్పాడు మానస్.
ఏదో విషయంలో కోపంతో రగిలిపోతున్నమానస్‌ని తన ముద్దులతో కరిగించేసింది ప్రియాంక. భోజనం ప్లేటు పట్టుకుని ముద్దు కావాలా ? ముద్ద కావాలా ? అని అడిగితే మానస్ ముద్దే కావాలన్నాడు. దీంతో ప్రియాంక దొరికిందే ఛాన్స్ అనుకుని ముద్దుల మీద ముద్దులిచ్చింది. ఇది చూసిన వారు ప్రియాంక.. బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వచ్చిందా, లేదా మానస్ సేవలో తరించిపోడానికి వచ్చిందా.. అని తిడుతున్నారు. కాజల్ కూడా ఓ సందర్బంలో ప్రియాంకకి చురకలు అంటించింది.
మానస్ తనతో మాట్లాడటం లేదని కాజల్ దగ్గర తెగ ఫీల్ అయిపోయింది ప్రియాంక. దీంతో.. అసలు నువ్ మానస్ కోసమే వచ్చావా ? బిగ్ బాస్‌కి .. వెయిట్ చేయి మాట్లాడతాడులే.. ఎవరూ ఎవరికోసం రాలేదు.. ఇదే గేమ్.. గేమ్‌లాగే ఆడు’ అని చురకలేసింది కాజల్.