Suhas : ఆడియన్స్ తలచుకుంటే యూట్యూబ్ స్టార్స్ కూడా హీరోలుగా అదరగొడతారు అనడానికి నిదర్శనం సుహాస్. యూట్యూబ్‌తో ఫేమస్ అయిన సుహాస్.. దోచేయ్ అనే సినిమాతో 2015లో టాలీవుడ్ తెరంగ్రేటం చేశాడు. ఈ సినిమా తర్వాత 2019లో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మజిలీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ రెండు సినిమాలు చేసిన తర్వాత మంచి పేరు రావడంతో డియర్ కామ్రేడ్, ప్రతి రోజు పండగే, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలలో కూడా మంచి పాత్రలు దక్కాయి.
2020లో కలర్ ఫోటో అనే సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేశాడు సుహాస్. హీరోగా ప్రవేశం చేసిన తర్వాత కూడా కమెడియన్ పాత్రలు వచ్చినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆ పాత్రలు చేస్తూ హీరో పాత్రలు కూడా చేస్తూ వస్తున్నాడు. అలా కలర్ ఫోటో రిలీజ్ అయిన తర్వాత రంగ్ దే, అర్థశతాబ్దం అనే రెండు సినిమాల్లో కూడా సుహాస్ కనిపించాడు. సుహాస్ హీరోగా రైటర్ పద్మభూషణ్ అనే సినిమా రూపొందుతోంది.
తెలుగులో లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ గా ఉన్న గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కూడా సుహాస్ సినిమా చేస్తున్నాడు. కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా సహా నిర్మిస్తున్నారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని దుశ్యంత్ కటికనేని తెరకెక్కిస్తున్నారు.
సుహాస్ కిట్టీలో ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. 2023 వరకు ఆయన కాల్షీట్స్ బిజీగా ఉన్నాయి. ఇటీవల మెర్సడీజ్ బెంజ్ కారు కూడా కొన్నాడు సుహాస్. ప్రస్తుతం రూ.60 లక్షల నుండి రూ.80 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్న సుహాస్ రానున్న రోజులలో మరింత పెంచనున్నాడని అంటున్నారు. ఏదేమైనా ఆడియన్స్ ఆదరణ ఉంటే ఎవరైనా కెరీర్ లో దూసుకుపోవచ్చని నిరూపించాడు.