Janhvi Kapoor : జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తాను చేసే కార్యక్రమాలకు సంబంధించి అప్‌డేట్స్ ను ఆమె పోస్ట్ చేస్తుంటుంది. పట్టుమని పది సినిమాల్లో నటించనే లేదు, కానీ తన తల్లి శ్రీదేవికి ఉన్న స్టార్ డమ్ కారణంగా.. జాన్వీ కపూర్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పవచ్చు.
జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు టూరిస్ట్ ప్లేస్‌లను సందర్శించడానికి ఇష్ట పడుతుంది. ఇటీవల సారా అలీఖాన్‌తో కలిసి జాన్వీ కపూర్ కేదార్‌నాథ్‌ను సందర్శించింది. ఇక పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా ఆమె వ్యవహరిస్తోంది. దీంతో వాటికి చెందిన ప్రమోషనల్ పోస్టులను కూడా ఈమె తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తుంటుంది.
ఎప్పటికప్పుడు ఫోటోషూట్‌ల ద్వారా కూడా జాన్వీ కపూర్ అలరిస్తుంటుంది. ఆమె చేసే ఫోటోషూట్‌లకు చెందిన ఫొటోలు, వీడియోలను చూస్తే కుర్రకారు గుండెల్లో గుబులు పుడుతుంది. ఆమె ఫొటోలను చూస్తే యువతకు అస్సలు నిద్ర పట్టదు. అందాల ప్రదర్శనలో ఇతర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో జాన్వీ గ్లామర్ షో చేస్తుంటుంది. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ తాలూకు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
https://www.instagram.com/p/CVVMQLLolOB/?utm_source=ig_web_copy_link