Sarkaru Vari Pata : 2020 సంక్రాంతి బరిలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆయన నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట చిత్రాన్ని 2021 సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు, కానీ కుదరలేదు. 2022 సంక్రాంతికి గట్టి పోటీ ఉన్నా కూడా మహేష్ తన సినిమాని బరిలోకి దింపారు.
కానీ ఏమైందో ఏమో.. సర్కారు వారి పాట న్యూ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. ఇందులో సముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నారు.
భారీ బ్యాంకింగ్ కుంభకోణంలో ఇరుకున్న తన తండ్రిని కాపాడుకునే కొడుకుగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించి సందడి చేయనున్నారు.