Tamanna : మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది సిటీమార్, మాస్ట్రో వంటి సినిమాలతో మంచి హిట్ కొట్టింది. అదేవిధంగా మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించింది. ఇక తమన్నా ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటిస్తున్న భోళా శంకర్ గురించి తెలిసిందే. ఈ సినిమాకు గాను నవంబర్ 11న షూటింగ్ ప్రారంభం కానుంది. 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో తమన్నా నటిస్తోందని తెలుస్తోంది. ఇది వరకే తమన్నా చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించింది. తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో తమన్నా చిరంజీవితో కలిసి ఆడిపాడనుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకోసం తమన్నా భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో నటించడం కోసం తమన్నాకు ఏకంగా మూడు కోట్ల రూపాయలను కూడా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమయ్యారట. ఏది ఏమైనా మిల్కీ బేబీ ఒకే సారి ఇంత డిమాండ్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.