Bigg Boss 5 : బిగ్ బాస్ కార్యక్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. గత సీజన్స్ ను పరిశీలిస్తే పండగ సందర్భంగా ఎలిమినేషన్‌ని పూర్తిగా ఎత్తి వేశారు. కానీ ఈ సీజన్లో దసరా, దీపావళికి అలాంటి రూల్స్ ఏమీ లేవు. ముఖ్యంగా దీపావళికి నామినేషన్ ఉండదని అందరు అనుకున్నారు. ఈ సారి నామినేషన్ ప్రక్రియ కాస్తా ఎమోషనల్‌గా సాగిన విషయం తెలిసిందే. నామినేషన్ కోసం వారికి వచ్చిన లెటర్స్ ని త్యాగం చేస్తూ నామినేట్ అయ్యారు.
ఈ సారి నో ఎలిమినేషన్ పెట్టడానికి గల కారణం తెలిసింది. గతవారం సన్ డే ఫన్ డే గేమ్స్ లో భాగంగా అనీమాస్టర్ కి ప్రత్యేకమైన పవర్ ఇచ్చింది బిగ్ బాస్ టీమ్. ఈ పవర్ ఆధారంగా తనని తాను నామినేషన్స్ నుంచి కాపాడుకునే విధంగా ప్లాన్ చేశారు. ఈ వారం అనీ మాస్టర్ నామినేషన్లో ఉండి ఉంటే ఆ పవర్ యూజ్ చేసి తనను కాపాడుకునేది. ఇదంతా బిగ్ బాస్ చేసిన ప్లాన్ గా తెలుస్తోంది.
అనీ మాస్టర్ ఈవారం నామినేషన్స్ లో లేకపోవడంతో అత్యంత నాటకీయంగా లోబోని, రవిని లాస్ట్ వరకూ ఉంచి ఎలిమినేషన్ ప్రక్రియని నిర్వహించారు. ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి కొంత టెన్షన్ ను కూడా క్రియేట్ చేశారు. చివరకు లోబో ఎలిమినేట్ అయిపోగానే విశ్వ, రవి బాగా ఎమోషనల్ అయ్యారు. లోబో మాత్రం చాలా కూల్‌గా బయటకు వచ్చేసి అందరి గురించి పాజిటివ్‌గా మాట్లాడి వెళ్లాడు.