Chiranjeevi : ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ సమయంలో హాలోవీన్ ఫెస్టివల్‌ను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. గుమ్మడికాయలను భయం గొలిపే భూతాలు, దెయ్యాల ఆకారాల్లో తీర్చిదిద్ది.. హార్రర్ మూవీలను చూస్తుంటారు. అలాగే భయం గొలిపే వేషధారణలు వేస్తుంటారు. ఈ సమయంలో విదేశాల్లో చాలా మంది హాలోవీన్ ఫెస్టివల్‌ను జరుపుకుంటారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఫెస్టివల్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి భయం గొలిపే రీతిలో మేకప్ వేసుకుని హాలోవీన్ ఫెస్టివల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఆయనకు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఆయన వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇక కొందరైతే విషయం తెలియక ఆయన ఏదైనా మూవీలో ఈ విధంగా గెటప్ వేశారేమోనని అనుకుంటున్నారు.
Boss @KChiruTweets Insta story ❤️❤️😂😂 pic.twitter.com/7HYJmUyoJN
— chiranjeevi tharvathe yevarayina (@Deepu0124) October 31, 2021
కాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 04, 2022వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ ఇంకా గాడ్ ఫాదర్, భోళా శంకర్ అనే రెండు మూవీల్లోనూ నటిస్తున్నారు.