ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విమర్శనాత్మకంగా పలువురు చేస్తున్న ట్వీట్ లను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్విట్టర్ పలు ట్వీట్ లను బ్లాక్ చేసింది. ఈ విధంగా ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ట్వీట్ చేసిన వారిలో ఎంతో మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
ఈ విధంగా పలువురు చేసే ట్వీట్లు భారత ఐటీ చట్టానికి అనుగుణంగా లేవని, ఇవి చట్టాన్ని విమర్శించేలా ఉన్నాయంటూ ప్రభుత్వం ట్విట్టర్ కి పంపిన నోటీసులో పేర్కొంది. ఈ ట్వీట్స్ ద్వారా కోవిడ్ పరిస్థితుల పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, ముందుచూపు లేని కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి అంటూ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కుంభమేళాకు ఏ విధమైన ముందుచూపు కట్టడి చర్యలు లేకుండా అనుమతి ఇవ్వడం వల్లే ఈ వైరస్ మరింత ప్రబలిందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ విధమైనటువంటి ట్వీట్స్ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం చెందడంతో వీటిని బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది. గతంలో కూడా లోగడ రైతుల నిరసనలపై వచ్చిన ట్వీట్స్ విషయంలో ప్రభుత్వం ఇదే తీరు ప్రవర్తించడం మనకు తెలిసిందే.