Anushka Shetty : సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ పై ప్రతీ ఒక్కరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ ప్రొఫెషనల్ కెరీర్ ఎలా ఉంది ? వాళ్ళ పర్సనల్ లైఫ్ ని ఎలా లీడ్ చేస్తున్నారు ; వాళ్ళ పెళ్ళి విశేషాలేంటి, పెళ్ళైతే పిల్లల ప్లానింగ్, లేదా విడాకులు తీసుకుంటున్నారా లాంటి విషయాలు ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ లిస్ట్ లోకి ఈ మధ్య కాలంలో జ్యోతిష్కులు కూడా చేరారు. రీసెంట్ గా సామ్, చైతూలు విడాకులు తీసుకుంటే ఆ విషయం మూడేళ్ళ క్రితమే చెప్పానంటూ ఓ జ్యోతిష్కుడు న్యూస్ ఛానల్ కు ఎక్కారు.
దీనికి సంబంధించిన న్యూస్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ గా మరో జ్యోతిష్కుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క పెళ్ళి విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
నిజానికి అనుష్క పెళ్ళి టాపిక్ అంటే అభిమానులతోపాటు ప్రేక్షకులకు కూడా చాలా ఇంట్రెస్ట్. ఈమె పెళ్ళి విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. వచ్చే నెల 7వ తేదీతో అనుష్కకు 40 ఏళ్ళు పూర్తవుతాయి. అలాంటి అనుష్కకి సంబంధించిన వార్తలు మీడియాలో కూడా ఎక్కువగా రావడంతో అసలు అనుష్క పెళ్ళి చేసుకుంటుందా లేదా అనే వార్తలు ఎక్కువయ్యాయి.
ఆ మధ్య సోషల్ మీడియాలో యంగ్ రెబల్ స్టార్ తో స్వీటీ డేటింగ్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తల్ని వీరిద్దరూ కొట్టిపారేశారు. ఈ క్రమంలో ఓ కర్ణాటక జ్యోతిష్కుడు అనుష్క పెళ్ళి గురించి మాట్లాడుతూ.. ఆమె తన ప్రొఫెషనల్ కెరీర్ లో చాలా సిన్సియర్ గా ఉంటుందని, ఆమె ఫేస్ ని బట్టి చూస్తే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిన పెళ్ళి చేసుకోలేదని క్లియర్ గా తెలుస్తుందంటూ తెలిపారు. కచ్చితంగా ఆమె బయటి వ్యక్తినే పెళ్ళి చేసుకుంటుందని, 2023 లోపు అనుష్క పెళ్ళి జరగడం ఖాయం అని అన్నారు. జ్యోతిష్కుడు చెప్పినట్లు అనుష్క 2023 కల్లా బయటి వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుందో లేదో చూడాలి.