Pawan Kalyan Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో విజయం దక్కిన అనంతరం మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ప్రకాష్ రాజ్ ప్యానెల్‌పై ఘాటుగానే విమర్శలు, ఆరోపణలు చేశారు. ముందుగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ప్రెస్‌మీట్ పెట్టి మీడియా ముందు ఏడవడంతో అందుకు ప్రతిగా విష్ణు ప్యానెల్ సభ్యులు ప్రతి విమర్శలు చేశారు.
ఇక మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన సమయంలో మోహన్ బాబు పరోక్షంగా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారని.. ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అయితే మా ఎన్నికలు పెట్టిన చిచ్చు.. ఇప్పట్లో ఆరిపోయేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మంచు విష్ణుకు చేదు అనుభవం ఎదురైంది. పవన్ కల్యాణ్ ఆయనకు షాక్ ఇచ్చారు.
గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది దసరా అనంతరం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా ఆయన ఆ కార్యక్రమం నిర్వహించారు. దానికి పవన్ కల్యాణ్, మంచు విష్ణు కూడా అతిథులుగా వచ్చారు. ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. కానీ విష్ణు పవన్‌తో మాట్లాడేందుకు యత్నించారు. కానీ పవన్ పట్టించుకోనట్లు అలాగే ఉండిపోయారు.
అయితే మోహన్ బాబు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడారంటూ.. మెగా అభిమానులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కానీ తాజాగా మంచు విష్ణుకు ఎదురైన అనుభవం చూసి వారు హ్యాపీగా ఫీలవుతున్నారు. పవన్‌కు జై కొడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఇండస్ట్రీలో ఈ వివాదం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.