Rahul Dravid : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రెటరీ జై షాలు ద్రావిడ్‌తో మాట్లాడారు. ద్రావిడ్ అంగీకరించడంతోనే ఆయనను త్వరలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించనున్నట్లు బీసీసీఐ తెలియజేసింది. ప్రస్తుతం కోచ్‌గా కొనసాగుతున్న రవిశాస్త్రి పదవీకాలం టీ20 వరల్డ్ కప్ అనంతరం ముగియనుంది. దీంతో ఈ వరల్డ్ కప్ ముగిశాక న్యూజిలాండ్ సిరీస్ నుంచి ద్రావిడ్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేయనున్నారు.
కాగా రాహుల్ ద్రావిడ్‌కు కోచ్‌గా అపార అనుభవం ఉంది. 2012లో ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. 2016 నుంచి 2019 వరకు ఇండియా ఎ, అండర్ 19 జట్లకు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. 2016లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో ద్రావిడ్ పర్యవేక్షణలోని భారత జట్టు రన్నర్స్ అప్‌గా నిలిచింది.
ఇక 2018లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌లో ద్రావిడ్ శిక్షణలో భారత్ వరల్డ్ కప్ గెలిచింది. తరువాత ద్రావిడ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ద్రావిడ్ త్వరలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియామకం కానున్నారు.
అయితే ద్రావిడ్ నియామకంపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణను అందించడంలో ద్రావిడ్‌కు ఎంతో ప్రావీణ్యం ఉంది. దీంతో ద్రావిడ్ కోచింగ్‌లో భారత్ అద్భుతాలు చేస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.