Mohan Babu : గత నెల రోజుల నుంచి మా అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు ప్యానెల్ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇదిలా ఉండగా అక్టోబర్ 10వ తేదీన ఈ ఎన్నికలు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగాయి. ఇక ఎన్నికల కౌంటింగ్ తర్వాత మంచు విష్ణు అత్యధిక మెజార్టీతో గెలవడంతో ఆయనకు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.
అప్పటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న రెండు ప్యానెల్ సభ్యులు ఎలక్షన్ల తరువాత ఒకరికొకరు ఆలింగనం చేసుకొని సెల్ఫీలు కూడా దిగారు. ఈ పట్టింపులు అన్నీ ఎన్నికల వరకు మాత్రమేనని ఆ తర్వాత మనమందరం ఒకే తల్లి బిడ్డలం అని తెలియజేశారు. ఇక మా అధ్యక్షుడిగా విష్ణు గెలిచిన తర్వాత మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
క్రమశిక్షణకు మారుపేరు మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులని మనం ఎన్నోసార్లు విన్నాం. అదే క్రమశిక్షణతో మా సభ్యులందరూ మెలగాలని ఆయన తెలియజేశారు. ఇక లేనిపోని ప్రెస్ మీట్ లు పెట్టి తీవ్ర వివాదాలను సృష్టించకుండా ఉండటం కోసం మోహన్ బాబు కొందరు నటీనటులకు మా అధ్యక్షుడి అనుమతి లేకుండా ప్రెస్ మీట్ లు పెట్టకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.