నిండా ఇరవై సంవత్సరాలు పూర్తికాకముందే ఓ యువకుడికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే రైల్వే పట్టాలపై పడుకొని ఉన్న యువకుడిని గమనించిన లోకో పైలట్ లు సడన్ బ్రేక్ వేసి ట్రైన్ ఆపారు. ట్రైన్ ఆపినప్పటికీ యువకుడి ప్రాణాలతో మిగిలాడు కానీ అతడి కాళ్ళు మాత్రం విరిగిపోయిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
సోమవారం గుంటూరు వైపు నుంచి కృష్ణాకెనాల్ జంక్షన్‌కు వస్తున్న లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కృష్ణాకెనాల్ జంక్షన్‌కు అరకిలోమీటరు దూరంలో రైలు పట్టాల మీద ఓ యువకుడు పడుకున్నట్లు గుర్తించిన లోకో పైలెట్లు హనుమంతరావు, రఘురామరాజు రైలు ఆపడానికి షడన్ బ్రేక్ వేశారు. లోకో పైలట్ లు హారన్ కొట్టీనప్పటికి యువకుడు పట్టాల పై నుంచి పైకి లేవలేదు.
ఈ క్రమంలోనే ట్రైన్ ముందు భాగంలోని సేఫ్టీ గ్రిల్ యువకుడిని పక్కకు నెట్టేసింది. యువకుడు పట్టాల పక్కకు రాగ అతని కాళ్లు రెండు చక్రాల కింద పడి విరిగిపోయాయి. వెంటనే ఆ యువకుడ్ని ఇంజన్ వెనుక బోగీలో ఎక్కించుకుని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో విజయవాడ స్టేషన్లో 108 వాహనాన్ని సిద్ధంగా ఉంచి అతనిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆ యువకుడికి కాళ్లు అతికించే ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ప్రాణాలు మిగిలాయి కానీ కాళ్లు మాత్రం పెరిగిపోయాయని వైద్య అధికారులు తెలిపారు.