ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ చెన్నై అపోలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. జూన్ 26న నెల్లూరు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్ ను సరైన చికిత్స నిమిత్తం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు.యాక్సిడెంట్ లో మహేష్ తలకు, కళ్ళకు అధికంగా గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ క్రమంలోనే అతనిని చెన్నై అపోలోకి తరలించి చికిత్స చేస్తుండగా ఆరోగ్య పరిస్థితి క్షీణించి శనివారం కన్నుమూసారు.
ఈ విధంగా మహేష్ చనిపోవడంతో సినిమా ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అతని ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూనమ్ కౌర్ కత్తి మహేష్ మృతిపై స్పందించి తనదైన శైలిలో కత్తి మహేష్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు.
ఈ సందర్భంగా పూనమ్ చెబుతూ.. నా తప్పు లేకపోయినా.. ప్రతి రోజు నేను చస్తూ బతికాను నా మనసుకి ఇప్పుడనిపిస్తుంది ఇన్ని రోజులుగా నాకు ఇలా ఎందుకు జరిగిందని.. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఒక రాజకీయ పార్టీ తమ పరువు కోసం బలవంతంగా ఓ దళిత వ్యక్తిని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంది. నీ ఆత్మకు శాంతి కలగాలి.. ఓం శాంతి… ఇకపై ఆ పేర్లను ఎప్పుడు ప్రస్తావించను అంటూ కామెంట్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.